పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ న్యూ ఇయర్ కానుకగా అభిమానులకు ఊహించని బ్లాక్‌బస్టర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’ (Spirit) ఫస్ట్ లుక్ 2026 జనవరి 1న అధికారికంగా విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన క్షణాల నుంచే సోషల్ మీడియాలో అగ్నిపర్వతంలా పేలిపోయింది. ఈ క్రమంలో “ఇది ప్రభాస్ రీబర్త్”, “రెబెల్ స్టార్ కాదు.. రియల్ మాన్‌స్టర్” అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
‘స్పిరిట్’ ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ కనిపించిన తీరు ఇప్పటివరకు ఎప్పుడూ చూడనంత డార్క్, రా అండ్ రియల్ లుక్లో ఇంప్రెస్ చేస్తోంది. షర్ట్ లేకుండా జులపాల జుట్టు, ఒంటిపై గాయాలు, చేతిలో మందు బాటిలో, నోటిలో సిగరెట్.. ముందు హాట్ బ్యూటీ త్రిప్తి.. ఇలా ఫుల్ మాస్ యాక్షన్ రొమాంటిక్ హీరోలా మారిపోయాడు ప్రభాస్. ఇక మరి లోతుగా చూస్తే.. మూసిన కళ్లలో అగ్ని, ముఖంలో ఆగ్రహం, బాడీ లాంగ్వేజ్‌లో వైలెన్స్…ఇలా సందీప్ రెడ్డి వంగా మార్క్ ఇంటెన్సిటీ ఫస్ట్ లుక్ ఫ్రేమ్‌లో కనిపిస్తోంది.
Beyond inspiration || Beyond aspiration || Into creation👆🏼#SpiritFirstLook #OneBadHabit #Prabhas @imvangasandeep @tripti_dimri23 @vivekoberoi @InSpiritMode @bnaveenkalyan1 @rameemusic @sureshsrajan #BhushanKumar #KrishanKumar @ShivChanana @neerajkalyan_24 @sivadow55122… pic.twitter.com/2slHYLnFy3
— Bhadrakali Pictures (@VangaPictures) December 31, 2025
ఓవరాల్గా చెప్పాలంటే ఇది కేవలం మాస్ లుక్ కాదు.. సైకలాజికల్ డెప్త్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని ఫస్ట్ లుక్ స్పష్టంగా చెబుతోంది. అంతేకాదు..‘క్యారెక్టర్ మైండ్‌సెట్, సినిమా టోన్, హీరో యాటిట్యూడ్, కథలోని డార్క్ థీమ్’.. ఇలా అన్నీ ఒక్క ఫ్రేమ్‌లో చెప్పే ప్రయత్నం చేసాడు వంగా. అందుకే ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ ఒక షాక్ వేవ్ లాంటిదే అని భావించవచ్చు.
ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగా తన ప్రివియస్ సెంటిమెంట్ను కంటిన్యూ చేసేశాడు. సందీప్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సంచలనం "యానిమల్" ఫస్ట్ లుక్ కూడా న్యూ ఇయర్ రోజు నైట్ రిలీజ్ చేశాడు. ఇపుడు స్పిరిట్ ఫస్ట్ లుక్ సైతం 2026 జనవరి 1న రాత్రి 12AMకి న్యూ ఇయర్ స్పెషల్గా రిలీజ్ చేయడం విశేషం.
పవర్‌ఫుల్ పోలీస్ అవతార్‌లో ప్రభాస్..!
‘స్పిరిట్’లో ప్రభాస్ ఓ రా అండ్ రెబల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన పాత్రలన్నిటికంటే పూర్తిగా భిన్నంగా, రియల్, రఫ్, డార్క్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్గా ఈ మూవీ ఉండబోతుందనే విషయం అర్ధమైపోతుంది. ఫస్ట్ లుక్‌లోనే ప్రభాస్ ఇండియన్ సినిమాల్లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసేలా చేశాడు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా × ప్రభాస్ – కాంబోని ఫైర్ కాంబినేషన్ అని పిలవడం షురూ అయింది. అందుకు కారణం లేకపోలేదు ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో తన స్టాంప్‌ను ఇండియన్ సినిమాలో బలంగా వేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈసారి ప్రభాస్‌తో కలిసి రా, రగ్డ్, రియలిస్టిక్ యాక్షన్ డ్రామాను తీసుకురాబోతున్నారు.
వంగా స్టైల్ అంటేనే ఇంటెన్స్ ఎమోషన్స్, వైలెంట్ అండర్‌టోన్స్, క్యారెక్టర్ డెప్త్ – ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ‘స్పిరిట్’లో డబుల్ డోస్‌లో ఉండనున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.‘స్పిరిట్’లో ప్రభాస్ ఓ రా అండ్ రెబల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఇందులో ప్రభాస్‌కు జోడీగా, 'యానిమల్' బ్లాక్‌బస్టర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి త్రిప్తి డిమ్రి నటిస్తోంది.
ప్రభాస్-త్రిప్తిల ఫ్రెష్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. వీరితో పాటు, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ట్యూన్స్ సమకూరుస్తున్నారు. ఆయన సంగీతం 'యానిమల్'కు మేజర్ హైలైట్‌గా నిలిచింది. కాబట్టి, 'స్పిరిట్'లో కూడా అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలను ఉంటుంది.
