యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలో దాదాపు 30 ఏళ్ళ కిందట చనిపోయాడని అనుకున్న వ్యక్తి అకస్మాత్తుగా తిరిగొచ్చాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్ళీ ప్రత్యక్షమవ్వడంతో అతని కుంటుంబసభ్యులు షాక్ అయ్యారు. ముజఫర్ నగర్ జిల్లాలోని ఖతౌలీ పట్టణంలోని మొహల్లా బల్కారంకు చెందిన షరీఫ్ 28 ఏళ్ళ తర్వాత తన ఫ్యామిలీని కలుసుకున్నాడు. SIR కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ కోసం 28 ఏళ్ళ తర్వాత ఊళ్ళో ప్రత్యక్షమయ్యాడు షరీఫ్.
1997లో వెస్ట్ బెంగాల్ కి వెళ్లి..
షరీఫ్ మొదటి భార్య 1997లో మరణించింది. ఆ తర్వాత, అతను మళ్ళీ పెళ్లి చేసుకుని తన రెండవ భార్యతో వెస్ట్ బెంగాల్‌కు వెళ్లాడు. కొంతకాలం పాటు, కుటుంబం ల్యాండ్‌లైన్ ఫోన్‌ల ద్వారా కాంటాక్ట్ లో ఉన్నప్పటికీ, ఆ తర్వాత కమ్యూనికేషన్ కట్ అయ్యింది. వెస్ట్ బెంగాల్ లో ఉన్న షరీఫ్ ను కలుసుకునేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించినప్పటికీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో షరీఫ్ చనిపోయాడని భావించారు కుటుంబసభ్యులు.
ఎట్టకేలకు SIR కోసం పేపర్ వర్క్ అవసరం పడటంతో షరీఫ్ ఖతౌలీలోని తన ఇంటికి చేరుకున్నాడు. చనిపోయాడనుకున్న షరీఫ్ 28 ఏళ్ళ తర్వాత ప్రత్యక్షమవడంతో అతని ఫ్యామిలీ, బంధువులు, ఇరుగుపొరుగువారు షాక్ అయ్యారు. షరీఫ్ రాకతో అతని కుటుంబం ఒకింత ఆశ్చర్యంతో పాటు ఆనందంలో మునిగిపోయింది.
