జయత్రి ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థను డిఫాల్టర్‌గా ప్రకటించిన TG RERA

జయత్రి ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థను డిఫాల్టర్‌గా ప్రకటించిన TG RERA

హైదరాబాద్: జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ రియల్ ఎస్టేట్ సంస్థను తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) రెరా డిఫాల్టర్‌గా ప్రకటించింది. దుండిగల్, బౌరంపేట్లో జయ ప్లాటినమ్ ప్రాజెక్ట్ పేరుతో జయత్రి ఇన్ఫ్రా 66 శాతం కట్టి వదిలేసింది.

స్టిల్ట్ + గ్రౌండ్ + 5 అంతస్తులు, 60 ఫ్లాట్లు ఉన్న ప్రాజెక్టును 66 శాతం పనులు పూర్తయ్యాక 2022 జూన్‌లో నిర్మాణం నిలిపివేసింది. గడువు లోపు పూర్తి చేయకపోవడంతో కొనుగోలుదారులు TG RERAను ఆశ్రయించారు. 11-01-2024న జయత్రి ఇన్ఫ్రాకు RERA షోకాజ్ నోటీసు జారీ చేసింది. జయత్రి ఇన్ఫ్రా కు రూ. 2.36 కోట్ల జరిమానా విధించింది.

జయత్రి ఇన్ఫ్రాకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని MAUD, HMDA, DTCP, GHMCకి RERA లేఖలు రాసింది. సెక్షన్ 8 కింద వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుతో పనులను RERA పున: ప్రారంభించింది. ప్రత్యేక ఎస్క్రో ఖాతా, ఫైనాన్షియల్ ప్లాన్ సిద్ధం చేసి మిగిలిన 34% పనుల పూర్తి చేసిTG RERA కొనుగోలుదారులకు ఇచ్చింది. నిలిచిపోయిన ప్రాజెక్టులు చట్టబద్ధంగా పూర్తి చేశామని RERA స్పష్టం చేసింది.