రిలయన్స్ గ్రూప్ చైర్మెన్ అనిల్ అంబానీకి షాక్ ఇచ్చింది ఈడీ.. ముంబైలోని ఆయన లగ్జరీ నివాసం అబోడ్ ను సీజ్ చేశారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ ఆక్ట్ కింద అనిల్ అంబానీ ఇంటిని సీజ్ చేసినట్లు తెలిపింది ఈడీ. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న ఈ ఇంటి విలువ రూ. 3వేల 716 కోట్లు. 66 మీటర్ల ఎత్తు, 17 అంతస్తుల్లో ఉన్న అనిల్ అంబానీ అబోడ్ కి రిలయన్స్ లో జరిగిన బ్యాంకు స్కాంతో సంబంధం ఉన్నట్లు తేలడంతో సీజ్ చేసింది ఈడీ. అనిల్ అంబానీ అబోడ్ ను సీజ్ చేసినట్లు బుధవారం ( ఫిబ్రవరి 25 ) ప్రకటించింది ఈడీ. బ్యాంకు స్కాం కేసులో ఇప్పటివరకు రూ. 15 వేల 700 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.
ఈడీ చేపట్టిన యాంటీ మనీ లాండరింగ్ డ్రైవ్ లో భాగంగా అనిల్ అంబానీ అబోడ్ ను సీజ్ చేసినట్లు తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లో జరిగిన బ్యాంకు స్కాంకు, దుబారాకు అనిల్ అంబానీ అబోడ్ చిహ్నం లాంటిదని పేర్కొంది ఈడీ.
మళ్ళీ విచారణకు అనిల్ అంబానీ
ఈ కేసుకు సంబంధించి అనిల్ అంబానీ మరోసారి విచారణకు హాజరు కానున్నారని తెలిపింది ఈడీ. గత ఏడాది ఆగస్టులో ఈడీ విచారణకు హాజరయ్యారు అనిల్ అంబానీ. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ.. ఆర్ కామ్ లో మనీ లాండరింగ్ ద్వారా మళ్ళించబడ్డ సొమ్మును రికవర్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు
RCOM, అనిల్ అంబానీ, ఇతరులపై IPC సెక్షన్లు 120-B, 406, 420, తో పాటు PC చట్టం 13(2), 13(1)(d) సెక్షన్ల కింద అవినీతికి పాల్పడినట్లు CBI FIR ఆధారంగా దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపింది ఈడీ. RCOM, అనుబంధ సంస్థల భారీ రుణ ఎగవేతలపై ఈ కేసు నమోదయ్యింది.
►ALSO READ | ఇంకా మారని ఇండిగో తీరు.. విమానంలో 5 గంటల సేపు నరకం.. చెన్నై ఎయిర్పోర్ట్లో ప్యాసెంజర్ల ఆందోళన
