హైదరాబాద్లో ఈ డ్రైవర్ అప్పుడే డిచ్ అయ్యాడు.. వామ్మో 242 పాయింట్ల రీడింగా...

హైదరాబాద్లో ఈ డ్రైవర్ అప్పుడే డిచ్ అయ్యాడు.. వామ్మో 242 పాయింట్ల రీడింగా...

హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. పొద్దంతా ఉద్యోగాలు, పనులు చేసుకుని.. రోజు వారి సమయానికంటే కాస్త ముందుగానే న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో జాయిన్ అయ్యారు కొందరు. కానీ కొందరు మాత్రం.. తొందర పడి ఒక కోయిలా ముందే కూసింది అన్నట్లుగా.. సాయంత్రం లోపే ఫుల్ డిచ్ అయ్యి పోలీసులకు పట్టుబడుతున్నారు. రీడింగ్ చూసి పోలీసులు షాక్ కావాల్సిన పరిస్థితి.

న్యూ ఇయర్ ను దృష్టిలో ఉంచుకుని.. పోలీసులు బుధవారం (డిసెంబర్ 31) సాయంత్రం 7 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభించారు. సిటీ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేస్తున్నారు. మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్న వాళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.

 జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్  దగ్గర నిర్వహించిన తనిఖీల్లో ఆటోడ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి పట్టుబడ్డాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో ఆటో డ్రైవర్ కు 242 పాయింట్ల రీడింగ్ రావటం చూసీ పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు.