న్యూ ఇయర్ సందడి మొదలైంది. పల్లె నుంచి పట్నం వరకు ఎక్కడ చూసినా సెలబ్రేషన్ మూడ్ లో పడిపోయారు జనం. మరికొద్ది గంటల్లో 2025 సంవత్సరానికి వీడ్కోలు పిలి.. 2026 కు ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు. అయితే న్యూ ఇయర్ కిక్కు హైదరాబాద్ కంటే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. దీని వెనుక పెద్ద కారణమే ఉంది.
న్యూఇయర్ గ్రాండ్ సెలెబ్రేషన్స్ కోసం సుక్క, ముక్క సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్న పట్టణం నుంచి పెద్ద సిటీ వరకు వైన్స్, చికెన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. కొందరు పార్టీని సాయంత్రం నుంచే ప్లాన్ చేసేందుకు వైన్స్ కు క్యూ కట్టారు. చేవెళ్లలో సాయంత్రం లోపే వైన్స్ షాపుల ముందు బారులు తీరారు. స్టఫ్ కోసం చికెన్ రెడీ చేసుకుంటున్నారు. హైదరాబాద్ వైన్స్ తో పోల్చితే చేవెళ్లలో ఎందుకంత డిమాండ్ అంటే.. హైదరాబాద్ నుంచి చేవెళ్ల మధ్యలో ఎక్కువగా ఫామ్ హౌస్ లు ఉండటం.
కొత్త ఏడాది సంబరాల కోసం అర్ధరాత్రి12 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. అదే క్రమంలో బార్లకు ఒకటి గంటల నడిపంచుకోవచ్చునని పర్మిషన్ ఇచ్చింది. అయితే చేవెళ్ల నియోజవర్గంలో ఎక్కువగా ఫామ్ హౌస్ లు ఉండటంతో నియోజకవర్గంలో.. ముఖ్యంగా చేవెళ్ల పట్టణంలో కొత్తం సంవత్సరం కల మొదలైంది.
చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి మండల పరిధిలోని అనేక ఫామ్ హౌస్ లు, రిసార్ట్స్ లు ఉండడంతో టౌన్ లో వైన్ షాపులు అందంగా ముస్తాబు చేసింది యాజమాన్యం.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025లో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. కొత్త మద్యం పాలసీ ప్రభావంతో ఈ ఏడాది లిక్కర్ సేల్స్ ఊహించని స్థాయికి అనుకుంటున్నారు. ఈ మూడు కలిసి ఈసారి డిసెంబర్ 31ను లిక్కర్ కిక్కు డేగా మార్చబోతున్నాయ్ అంటూ పలువురు పేర్కొంటున్నారు.
