యాదాద్రి: ఆస్తుల కోసమే చీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో కొట్లాట జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో ఒక్క పైసా పని చేయకుండా రాష్ట్రా న్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో నిర్మించతలపెట్టిన నూతన ఏటిసీకి ఆయన ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ సర్కార వ్యవస్థను నాశనం చేసిందని, ఇచ్చిన హామీలను కేసీఆర్ మర్చి పోయారని విమర్శించారు.
ALSO READ | త్వరలో మరిన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు: మంత్రి వివేక్
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్న మంత్రి యువతకు నాణ్యమైన విద్యతోపాటు ఆధునిక నైపుణ్యం, శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించా రు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ రూ.3,622 కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. ఇందిరమ్మ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ఇప్పుడు మళ్లీ కొనసాగిస్తున్నామని అర్హులైన ప్రతి ఒక్కరి కీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
యంగ్ ఇండియా స్కూల్స్ పేదలకు వరంగా మారాయని, ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి గుర్తు చేశారు. రాసున్న రోజుల్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు. విడుదల అవుతాయని యువతకు భరోసా ఇచ్చారు.
