త్వరలో మరిన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు: మంత్రి వివేక్

త్వరలో మరిన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు: మంత్రి వివేక్

హైదరాబాద్: త్వరలో మరిన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లు ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ప్రోత్సాహకం అందిస్తామని  చెప్పారు. బుధవారం (డిసెంబర్ 31) తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డగూడూరులో ఐటీఐకు మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతంలో ఐటీఐ ఏర్పాటు కోసం భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీఐలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి కల్పించడం కోసం ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రేషన్ ద్వారా పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టిస్తోందని.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. 

ALSO READ : ఈ గంజాయి ఏంటి.. ఇలా ఉంది..?

తుంగతుర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే మందుల సామెల్ రూ.3622 కోట్ల నిధులు తెచ్చి తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల కోసం ఒక్క పైసా కూడా ఖర్చుచేయకుండా వ్యవస్థని నాశనం చేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పదేళ్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. అక్రమ ఆస్తుల కోసమే కేసీఆర్ కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారని అన్నారు.