భారత్ దెబ్బకు.. 2026లో కూడా పాక్ కోలుకోవడం కష్టమే.. మిలిటరీ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే..

భారత్ దెబ్బకు.. 2026లో కూడా పాక్ కోలుకోవడం కష్టమే..  మిలిటరీ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే..

భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఇంకా కోలుకోలేక పోతోంది. ఇండియా కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటుంటే.. పాక్ ఆపరేషన్ సిందూర్ నాటి శిథిలాలను తొలగించేపనిలోనే ఉంది. ఏడు నెలలు పూర్తి కావస్తున్నా.. నేలమట్టం అయిన ఎయిర్ బేస్ లను ఇంకా పునర్నిర్మించలేని పరిస్థితిలో ఉంది. శాటిలైట్ ఇమేజెస్ నుంచి చూస్తే.. 2026 కొత్త సంవత్సరంలో కూడా ఎయిర్ బేస్ లను నిర్మించుకునే పరిస్థితి ఉందని తెలుస్తోంది.

చెవిలో జోరీగలాగ పక్కనే ఉంటూ ఎప్పుడూ కవ్విస్తూ వస్తున్న పాక్ కు ఇండియా కోలుకోలేని దెబ్బ తీసింది. తన సామర్థ్యమేంటో తెలియకుండా.. ఏనుగుపైకి ఎలుక యుద్ధానికి సిద్ధమైనట్లు వ్యవహరించిన పాక్ కు మరోసారి యుద్ధం అనకుండా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సిందూర్ చేసిన గాయాలు ఆ దేశ ఆర్మీ బేస్ లు ఇంకా శిథిలావస్థలోనే ఉండేలా చేసింది. మొత్తం 11 కీలకమైన ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది ఇండియా. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా పాక్ పరిస్థితిని విశ్లేషించిన డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ సందీప్ ఉన్నిథన్ మాట్లాడుతూ.. పాక్ ఇప్పటికీ ఎయిర్ బేస్ లను పునర్ నిర్మించుకునే పనిలోనే ఉందని తెలిపారు. 

ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాక్:

ఇన్నాళ్లు ఆపరేషన్ సిందూర్ లో పాక్ ఎయిర్ బేస్ లు ధ్వంసం కాలేదని.. తామే ఇండియాను దెబ్బతీశామని చెప్పిన పాక్.. చేశామని ఇండియా ఇటీవలే నిజం ఒప్పుకుంది. అంతర్జాతీయ సమాజం ముందు ఎంత దాచినా దాగని నిజాలను, భారత్ సాక్ష్యాలతో తెస్తున్న ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. 

ఆపరేషన్ సిందూర్ లో ఎయిర్ బేస్ లు ధ్వంసం అయినట్లు డిసెంబర్ 3వ వారంలో.. ప్రకటించింది పాక్. ఆపరేషన్ సిందూర్ తర్వాత మొట్టమొదటి సారి.. పాక్ నిజాన్ని ఒప్పుకోవడం. పాక్ ఉప ప్రధాని ఇశాక్ దార్ మాట్లాడుతూ.. పాక్ కీలకమైన ఎయిర్ బేస్ లను కోల్పోయిందని.. ముఖ్యమైన మిలిటరీ కేంద్రాలతో పాటు, ఆర్మీ అధికారులు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. 36 గంటల్లో 80 డ్రోన్స్ తో ఇండియా అటాక్ చేసిందని ఒప్పుకున్నారు. 

ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఉన్నట్లుండి సడెన్ గా అంగీకరించడం వెనుక.. నిజాలు మెల్లమెల్లగా బయటకు వస్తుండటమే. ఇప్పటికే ఇండియా ఆధారాలతో సహా ప్రపంచం ముందు ఉంచుతుండటంతో.. పాక్ అసత్య ప్రచారాలపై వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఎట్టకేలకు నిజం ఒప్పుకుందని స్పష్టమవుతోంది. 

ధ్వంసమైన ఎయిర్ బేస్ లు ఇవే:

భారత్ డ్రోన్ల ధాటికి పాకిస్తాన్ కు చెందిన 11 ఎయిర్ బేస్ లు ధ్వంసమయ్యాయి. 
అవి:1.నూర్ ఖాన్ (రావల్పిండి), 2.భొలారీ ఎయిర్ బేస్ 3.మురిద్ ఎయిర్ బేస్, 4.ముఫాఫ్​ ఎయిర్ బేస్ (సర్గోధా), 5.జకోబబాద్ ఎయిర్ బేస్, 6.రఫిఖీ ఎయిర్ బేస్, 7.సుక్కుర్ ఎయిర్ బేస్, 8.చునియన్ ఎయిర్ బేస్, 9.పస్రుర్ ఎయిర్ ఫీల్డ్, 10.సియల్కోట్ ఎయిర్ బేస్, 11.స్కర్దు ఎయిర్ బేస్


పూర్తికాని ఎయిర్​బేస్​ల రిపేర్

భారత్ ఆపరేషన్ సిందూర్​ చేపట్టి దాదాపు ఆరు నెలలు అవుతున్నది. అయితే, పాక్ ఇంకా తమ ఎయిర్​బేస్​లను మరమ్మత్తు చేస్తూనే ఉన్నది. నూర్ ఖాన్‌‌‌‌లో కొత్త ఫెసిలిటీలను నిర్మిస్తున్నారు. అలాగే దాడి జరిగిన స్థలంలో పనులు కొనసాగుతున్నాయి. జాకోబాబాద్‌‌‌‌లో కూడా మరమ్మత్తు పనులు లేటు అవుతున్నాయి. తాజా శాటిలైట్ ఫొటోలతో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారత్ దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదని.. అలాగే ఆ దేశంలోని ఇతర ఎయిర్​బేస్​ల రిపేర్ పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని తేలింది. నిధుల కొరత, సామర్థ్య లోపం, సరైన సాంకేతికత లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నది.