అమెరికా కాలిఫోర్నియాలో అదృశ్యమైన కర్ణాటక విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి చెందాడు. ఆరు రోజుల తర్వాత అతడి మృతదేహాన్ని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ పోలీసులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ధృవీకరించారు. సాకేత్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాలోని అతని కుటుంబానికి అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. ఈ సమయంలో అతని కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పింది.
అమెరికాలో కర్నాటకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య (22) బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి సాకేత్ కనబడకుండా పోయాడని అధికారులు తెలిపారు. చివరిసారిగా యూనివర్సిటీ క్యాంపస్‌కు దాదాపు కిలోమీటర్ దూరంలో సాకేత్‌ను కనిపించాడని చెప్పారు. ఈ క్రమంలో క్యాంపస్ దగ్గర్లో ఉన్న టిల్డెన్ రీజినల్ పార్క్‌కు సమీపంలో సాకేత్‌కు చెందిన పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాక్‌ప్యాక్ గుర్తించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. బర్కిలీహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాలపై వెతుకుతుండగా అతడి మృతదేహం దొరికింది. అయితే శ్రీనివాసయ్యది హత్య లేక ఆత్మహత్యనా అనేది తెలియాల్సి ఉంది.
