ఇరాన్‌‌లో అధికారమార్పు మంచిదే!..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌‌లో అధికారమార్పు మంచిదే!..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌‌లో అధికార మార్పు జరిగితే మంచిదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  అన్నారు. ఇరాన్‌‌పై అమెరికా సైనిక చర్యలకు దిగుతుందన్న వార్తల నేపథ్యంలో ట్రంప్​ వ్యాఖ్యలకు ప్రాధాన్యం పెరిగింది. 

ట్రంప్ ఇప్పటికే  ఎయిర్‌‌ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్‌‌ను నార్త్​ కరేబియన్​ సముద్రం నుంచి ఇరాన్​ దిశగా పంపుతున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకగా పేరున్న యూఎస్​ఎస్​ జెరాల్డ్​ ఆర్. పోర్డ్​కూడా కరేబియన్ ప్రాంతం నుంచి బయలుదేరింది. 

ఇటీవల రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరగొచ్చని సంకేతాలిచ్చిన ట్రంప్.. ఇప్పుడు మాట మార్చడంతో రెండు దేశాల మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.