వాషింగ్టన్ డీసీ: ప్రేమికుల రోజున గులాబీలు, చాక్లెట్లు పంచడం పాత పద్ధతి.. రాజకీయ ప్రత్యర్థులకు చురకలు అంటిస్తూ ప్రేమను చూపించడం ట్రంప్ స్టైల్. వాలంటైన్స్ డే సందర్భంగా వైట్ హౌస్ విడుదల చేసిన డిజిటల్ వాలంటైన్ కార్డ్ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ట్రంప్ ప్రభుత్వ విదేశీ విధానాలు, వివాదాస్పద నిర్ణయాలను జోడిస్తూ రూపొందించిన ఈ కార్డులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఉద్దేశించి ఒక కార్డును రూపొందించారు. అందులో మదురో ఫోటోతో పాటు సువ్వు నా హృదయాన్ని నిర్బంధించావు అనే క్యాప్షన్ ఇచ్చారు. వెనిజులాపై అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వ్యంగ్యంగా వాడుతూ ఈ కార్డును సిద్ధం చేశారు. మెక్సికో సరిహద్దులో నిర్మిస్తున్న గోడను ఉద్దేశించి.. నీ చుట్టూ నేను గోడ కట్టలేను.. ఎందుకంటే నీపై నా ప్రేమకు హద్దులు లేవు అనే తరహాలో సెటైరికల్ కార్డులు కూడా నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
