Gold & Silver: కొత్త ఏడాది ముందు తగ్గిన గోల్డ్.. వెండి ర్యాలీకి బ్రేక్.. హైదరాబాద్ రేట్లివే..

Gold & Silver: కొత్త ఏడాది ముందు తగ్గిన గోల్డ్.. వెండి ర్యాలీకి బ్రేక్.. హైదరాబాద్ రేట్లివే..

ఈ రోజుతో 2025 ముగియనుంది. ఈ ఏడాది బంగారం వెండి పెరిగిన తీరు చరిత్రలో ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. బెట్ వేసిన ఇన్వెస్టర్లు హ్యాపీగానే ఉన్నప్పటికీ.. రిటైల్ షాపర్లకు మాత్రం పెరిగిన ధరలు నిరాశనే మిగిల్చాయి. జీవితంలో మళ్లీ బంగారం, వెండి కొనగలమా అన్నంత స్థాయికి లోహాల ధరలు చేరుకున్నాయి. నేడు బంగారం రేట్లు కొంత తగ్గగా.. వెండి మాత్రం స్థిరంగా ఉంది. ఈ క్రమంలో సంక్రాంతి, న్యూ ఇయర్ కోసం షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందుగా తమ ప్రాంతంలోని మారిన ధరలను గమనించండి. 

తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 31, 2025న బంగారం రేట్లు తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో డిసెంబర్ 30 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.32 తగ్గింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 588గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ గ్రాముకు రూ.12వేల 455గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ఇక వెండి తన మెగా ర్యాలీకి చిన్న బ్రేక్ ఇచ్చింది న్యూ ఇయర్ ముందు రోజున. దీంతో బుధవారం డిసెంబర్ 31, 2025న వెండి రేటు ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 58వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.258 వద్ద మార్పు లేకుండా నేడు కొనసాగుతోంది.