హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్‌లో కీలక పరిణామం జరిగింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూషన్ విషయంపై రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసుపై ఇప్పటికే ఏసీబీ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు కూడా గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ కేసులో రాజకీయ, అధికారులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి రావడంతో ఏసీబీ ఛార్జ్‌షీట్‌కు దాఖలు చేసేందుకు సిద్ధమైంది.
ఫార్ములా ఈ కార్ రేసు'లో హెచ్‌ఎమ్‌డీఏ భాగస్వామి కాకపోయినా, దాని ఖాతా నుంచి రూ.54.88 కోట్లు చెల్లించారు. ఆర్థికపరమైన అనుమతులు లేకుండానే కేటీఆర్ ఇందుకు ఒత్తిడి తెచ్చారని ఏసీబీ నివేదికలో వెల్లడించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నిబంధనలను తుంగలో తొక్కి విదేశీ కంపెనీలకు ఫండ్స్ మంజూరు చేయడం మరో అభియోగం.
నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో నిధులు బదిలీ చేయడంతో హెచ్‌ఎండీఏ ఆదాయ పన్ను శాఖకు రూ.8 కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఫార్ములా -ఈ కార్ రేసుకు సంబంధించి మూడేళ్లలో 600 కోట్ల రూపాయలు చెల్లించేలా ఒప్పందాలు జరిగినట్టు దర్యాప్తు సంస్థలు తేల్చాయి.
