పాపం కొత్త సంవత్సరం చూడకుండానే.. స్కూటీపై రోడ్డు క్రాస్ చేస్తుంటే.. పని చేసే కంపెనీ ముందే ప్రాణం పోయింది !

పాపం కొత్త సంవత్సరం చూడకుండానే.. స్కూటీపై రోడ్డు క్రాస్ చేస్తుంటే.. పని చేసే కంపెనీ ముందే ప్రాణం పోయింది !

హైదరాబాద్: కొత్త సంవత్సరానికి ముందు ఆ కుటుంబంలో విషాదం జరిగింది. రోజూలానే ఉద్యోగానికి వెళ్లిన అతనికి మృత్యువు ఆయిల్ ట్యాంకర్ రూపంలో ఎదురైంది. కొత్త సంవత్సరంపై కోటి ఆశలతో ఉన్న అతనిని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో స్పాట్లోనే ప్రాణం పోయింది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేధా కంపెనీ ఎదురుగా ఈగ మహేష్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. 

మేధా కంపెనీలో పని చేసే ఈగ మహేష్ యాక్టివా బండిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఈగ మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ను పోచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆయిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో స్కూటీ నుజ్జునుజ్జయింది. ఈగ మహేష్ స్కూటీపై నుంచి పక్కన పోయి పడ్డాడు. రోడ్డుకు తల బలంగా కొట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై స్పాట్లోనే ప్రాణం పోయింది. తను పనిచేస్తున్న కంపెనీ ఎదురే మహేష్ ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదం నింపింది. 

►ALSO READ | ఈ గంజాయి ఏంటి.. ఇలా ఉంది..? రూ.3 కోట్ల సరుకు దొరికింది.. హైడ్రోపోనిక్ గాంజా అంటే ఏంటంటే..

యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న సహోద్యోగులు రోజూ తమ మధ్య నవ్వుతూ సరదాగా ఉండే మనిషి రోడ్డుపై రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు. మహేష్ను ఆ స్థితిలో చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.