శంషాబాద్ లో పిక్నిక్ వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..

శంషాబాద్ లో పిక్నిక్ వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..

శంషాబాద్ లో పిక్నిక్ కి వెళ్తున్న స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చంపాపేట్ నుండి శంషాబాద్ పిక్నిక్ కోసం వెళ్తున్న స్కూల్ బస్సు శంషాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులో ప్రయాణిస్తున్న పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి .. పిల్లలను కిందకి దించాడు.

బస్సులో మంటలు చెలరేగిన సమయంలో వెనక నుంచి ఇతర వాహనాలు వచ్చి ఉంటే ప్రమాదం స్థాయి తీవ్రంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఈ ఘటన జరిగిన సమయంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎట్టకేలకు అప్రమత్తంగా వ్యవహరించి పిల్లల ప్రాణాలు కాపాడిన డ్రైవర్ కు కృతఙ్ఞతలు చెబుతున్నారు పేరెంట్స్.

ఇదిలా ఉండగా... శంషాబాద్ లో ఇటీవల మరో స్కూల్ బస్సు బోల్తా పడింది. ముందున్నవాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది స్కూల్ బస్సు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ బస్సు శంషాబాద్ నుంచి హైదరాబాద్ కు పిక్నిక్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.