నిజామాబాద్ నగరంలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. గురువారం ఆమె ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి గెస్ట్‌గా వచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. షాపింగ్ మాల్‌లో నూతన వస్త్రాలతో నిధి అగర్వాల్ ఫొటోలు దిగుతూ అభిమానులతో సరదాగా గడిపారు. కార్యక్రమంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ డైరెక్టర్లు ఎస్.రాజమౌళి, పి.వెంకటేశ్వర్లు, టి.ప్రసాద్ రావు పాల్గొన్నారు.
