దంతెవాడలో ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌.. బైరంగఢ్‌‌‌‌ ఏరియా కమిటీ  కమాండర్‌‌‌‌ మృతి

దంతెవాడలో ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌.. బైరంగఢ్‌‌‌‌ ఏరియా కమిటీ  కమాండర్‌‌‌‌ మృతి

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో బైరంగఢ్‌‌‌‌ ఏరియా కమిటీ మెంబర్‌‌‌‌, కమాండర్‌‌‌‌ పూనెం రాజేశ్​మృతి చెందారు. మావోయిస్టుల సంచారం విషయాన్ని తెలుసుకున్న డీఆర్జీ బలగాలు గీదం పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌ పరిధిలోని గుమల్మార్‌‌‌‌, గిర్సాపారా, నెల్గోడ అడవుల్లో కూంబింగ్‌‌‌‌ ప్రారంభించారు. ఈ క్రమంలో బలగాలను గుర్తించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించడంతో మావోయిస్టులు కాల్పులు జరుపుతూ అడవుల్లోకి పారిపోయారు. కాల్పులు ముగిసిన తర్వాత భద్రతా బలగాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా.. కమాండర్‌‌‌‌ రాజేశ్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీ కనిపించింది. అలాగే ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ జరిగిన ప్లేస్‌‌‌‌ నుంచి ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌, ఇన్సాస్‌‌‌‌ రైఫిల్, పిస్టల్‌‌‌‌, వాకీటాకీ, ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ మ్యాగజైన్‌‌‌‌, తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు బలగాలు తెలిపారు.