అంగన్వాడీల ద్వారా నాణ్యమైన ఆహారం అందించాలి  :  బక్కి వెంకటయ్య

అంగన్వాడీల ద్వారా నాణ్యమైన ఆహారం అందించాలి  :  బక్కి వెంకటయ్య

సిద్దిపేట రూరల్, వెలుగు: అంగన్వాడీల ద్వారా చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందేలా పర్యవేక్షించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ కె.హైమావతి అధ్యక్షతన నిర్వహించిన డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్ విజిలెన్స్ కమిటీ సమావేశానికి ఆయన హాజరై జాతీయ ఆహార భద్రత చట్టం అమలుపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగనవాడీల్లో టీచర్, ఆయా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, అన్ని సంక్షేమ హాస్టళ్లలో పౌష్టికాహారం అందించాలన్నారు. పోతిరెడ్డిపేట జడ్పీ హై స్కూల్ లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి తనూజ, మేనేజర్ గోపికృష్ణ, జిల్లా అధికారులు జయదేవ్ ఆర్య, డాక్టర్ ధనరాజ్, శివరంజని, శ్రీనివాస్ రెడ్డి, శారద తదితరులు పాల్గొన్నారు.