అస్సాంలో మిస్సైన యుద్ధ విమానం కూలిపోయింది. గురువారం (మార్చి 05) సాయంత్రం రాడార్ నుంచి కనిపించకుండా పోయిన జెట్ ప్రమాదానికి గురైనట్లు ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. జెట్ మిస్సైన క్రమం నుంచి రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన ఎయిర్ ఫోర్స్.. జెట్ అగ్ని ప్రమాదానికి గురైనట్లు ప్రకటించారు. అస్సాం కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో క్రాష్ అయినట్లు తెలిపారు.ఈ ప్రమాదంలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్ పైలట్లు చనిపోయినట్లు వెల్లడించారు.
రోజూ వారి ట్రైనింగ్ మిషన్ లో భాగంగా విన్యాసాలు చేస్తున్న క్రమంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయి విమానం కనిపించకుండా పోయింది. కర్బీ ఏరియాలో పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయినట్లు IAF ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అంజు, ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ పూర్వేశ్ దురాగ్కర్ చనిపోయారని తెలిపారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సుఖోయ్30 ఎంకేఐ ఫైటర్ జెట్ మిస్సైన విషయం తెలిసిందే. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన యుద్ధవిమానం రాత్రి 7.42 గంటలకు రాడార్ నుంచి కనిపించకుండా పోయిందని వాయుసేన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఆ యుద్ధ విమానాన్ని లొకేట్ చేసేందుకు రాత్రంతా ప్రయత్నాలు కొనసాగించింది టీమ్.
సుఖోయ్ జాడను కనిపెట్టేందుకు సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్ ప్రారంభించామని వెల్లడించింది. కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెప్పారు. అయితే, ఈ పేలుడుకు, సుఖోయ్ మిస్సింగ్ కు సంబంధం ఉందా? లేదా? అన్న అనుమానాలు వెల్లడించారు. కానీ సెర్చ ఆపరేషన్ తర్వాత సుఖోయ్ విమానమేనని నిర్ధారించుకున్నారు. రష్యాకు చెందిన సుఖోయ్ ఫైటర్ జెట్ లకు భారీ మార్పులు చేసి వాయుసేన వినియోగిస్తోంది.
