డిప్యూటీ సీఎం కొడుకు పెండ్లికి.. ఆదిలాబాద్ ఆదివాసీ మహిళలు

డిప్యూటీ సీఎం కొడుకు పెండ్లికి.. ఆదిలాబాద్  ఆదివాసీ మహిళలు

ఇంద్రవెల్లి(ఉట్నూర్)/జైనూర్, వెలుగు: ఆదిలాబాద్  జిల్లా ఉట్నూర్  మండలం దేవుగూడ, జైనూర్​ మండలం భూసిమెట్ట గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు మరప గంగుబాయి, సుమన్ బాయి, సీడం లక్ష్మీబాయి, వాలే లక్ష్మీబాయి, డాకురే రుక్మబాయి, దుర్గ సింధూను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన కొడుకు సూర్య విక్రమాదిత్య వివాహానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. పీపుల్స్ మార్చ్  పేరిట సీఎల్పీ నేత హోదాలో భట్టి విక్రమార్క జిల్లాలో గతంలో చేపట్టిన పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తూ వచ్చిన ఆదివాసీ మహిళలను యాది ఉంచుకొని మరీ శుభలేఖలు పంపించారు. పెండ్లికి ఆహ్వానించడంతో పాటు వివాహ వేదికపై ప్రత్యేక స్థానం కల్పించి పెద్దలతో సమానంగా కూర్చోబెట్టడం అందరినీ ఆకట్టుకుంది. డిప్యూటీ సీఎం కొడుకు పెళ్లిలో తమను మర్యాదగా చూసుకోవడం పట్ల ఆదివాసీ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.