కూరగాయల అంగట్లో మద్యం అమ్మిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు !

 కూరగాయల అంగట్లో మద్యం అమ్మిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు !

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఒక వ్యక్తి మద్యం అమ్మిన విధానం చర్చనీయాంశంగా మారింది. బుధవారం (డిసెంబర్ 31) కూరగాయల అంగట్లో మద్యం అమ్ముతూ కనిపించాడు. కరీంనగర్ జిల్లాలో వివిధ రకాల మద్యం (బీర్లు, హార్డు) బాటిళ్లను అమ్ముతూ స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశాడు.

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో వారాంతపు సంతలో భామల రవీందర్ అనే సోషల్ వర్కర్ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపాడు. కూరగాయల అంగట్లో మద్యం అమ్మి నిరసన తెలిపడం అక్కడున్న వారిని ఆకర్షించింది.  

ఎన్నికల్లో ఓట్ల కోసం మద్యం పంపిణీ చేయడం పట్ల కూరగాయల మార్కెట్లో మద్యం అమ్మి నిరసన తెలిపాడు. మద్యానికి ఓటేసి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సందేశం ఇచ్చాడు. ఎన్నికల సందర్భంగా వారం రోజుల పాటు మద్యం తాగితే.. ఆ తర్వాత మన హక్కులపై నిలదీయలేమని చెప్పాడు. సర్పంచ్ స్థాయిలోనే రూ.20 నుంచి 30 లక్షలు ఖర్చు చేస్తే.. అతడి అప్పు తీరేదెన్నడు.. గ్రామాన్ని అభివృద్ధి చేసేదెన్నడు అని ప్రశ్నించాడు. ఒక రోజు మద్యం తాగి ఐదేళ్ల భవిష్యత్తును అమ్ముకోవద్దని అవగాహన కల్పించాడు.