కోనరావుపేట,వెలుగు: ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంతింటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని నూతన వస్త్రాలను అందజేశారు.
రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య,సర్పంచ్ కంది లక్ష్మీ,నాయకులు నాగిరెడ్డి,ఆగేష్, లచ్చిరెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
