కిమ్స్ కాలేజీలో మెగా ఉద్యోగ మేళా

కిమ్స్ కాలేజీలో మెగా ఉద్యోగ మేళా

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ లోని కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో మెరీనా పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళాను శనివారం నిర్వహించారు. కంపెనీలో ఉద్యోగాల గురించి డైరెక్టర్ పవన్ వివరించారు. కంపెనీ హెచ్ఆర్ లు ఎం.మహేశ్వరి, ఎం.రజని విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పేర్యాల రవీందర్ రావు నియమామక పత్రాలను అందజేశారు. ఇంటర్వ్యూలకు 400 మంది హాజరుకాగా 135 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్​ బి. అర్జున్ రావు, కృష్ణ మోహన్, గౌతమ్ పాల్గొన్నారు.