V6 వెలుగు ఎఫెక్ట్.. కరీంనగర్  కలెక్టరేట్ ప్రక్షాళన షురూ.. 

V6 వెలుగు ఎఫెక్ట్.. కరీంనగర్  కలెక్టరేట్ ప్రక్షాళన షురూ.. 
  • క్యాంప్ ఆఫీస్ నుంచి
  • సీసీ లక్ష్మీనర్సింహారావు ఔట్ 

కరీంనగర్ టౌన్, వెలుగు : ఏళ్ల తరబడి కలెక్టరేట్ లోనే విధుల్లో ఉన్న క్యాంప్ ఆఫీస్ సిబ్బందిని కలెక్టర్ చిత్రామిశ్రా ట్రాన్స్ ఫర్ చేశారు. 'ఎన్నేళ్లయినా కలెక్టరేట్ లోనే తిష్ట' అనే హెడ్డింగ్ తో ఈ నెల 9న ‘వీ6 వెలుగు’ పేపర్ లో స్టోరీ పబ్లిష్ అయిన విషయం తెలిసిందే. ‘వీ6 వెలుగు’లో కథనంతోపాటు గతంలో సామాజిక కార్యకర్త షాబుద్దీన్ ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ బదిలీలు చేసినట్లు సమాచారం. చాలా ఏళ్లుగా కలెక్టర్ సీసీగా పని చేస్తున్న గందె లక్ష్మీనర్సింహారావును ఆ స్థానం నుంచి తప్పించి కరీంనగర్ రూరల్ తహసీల్దార్ గా పోస్టింగ్ ఇచ్చారు. కరీంనగర్ రూరల్ తహసీల్దార్ రాజేష్ ను కలెక్టరేట్ సూపరింటెండెంట్ గా నియమించారు.

ఇప్పటి వరకు కలెక్టర్ కు ఒక్కరే సీసీ కొనసాగుతుండగా.. ఇక మీదట ఇద్దరు సీసీలు విధులు నిర్వర్తించనున్నారు. కలెక్టరేట్ లో కలెక్టర్ సీసీగా తిమ్మాపూర్ డీటీ రాకేష్ ను నియమించగా.. కలెక్టర్ క్యాంప్ ఆఫీసు సీసీగా కొత్తపల్లి ఎంపీడీఓ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ పూర్ణచందర్ ను డిప్యుటేషన్ పై నియమించారు. కలెక్టరేట్ లో పనిచేస్తున్న జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్లు దినేష్, వివేక్ రెడ్డి, ఎన్నికల  విభాగంలో సీనియర్ అసిస్టెంట్ అజహర్ ను కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.