హైదరాబాద్లో అప్పుడే మొదలైన డ్రంకెన్ డ్రైవ్.. మద్యం ప్రియుల పరిస్థితి ఏ ఏరియాలో ఎలా ఉందంటే..

హైదరాబాద్లో అప్పుడే మొదలైన డ్రంకెన్ డ్రైవ్.. మద్యం ప్రియుల పరిస్థితి ఏ ఏరియాలో ఎలా ఉందంటే..

న్యూ ఇయర్ వేడుకలు చేసుకునేందుకు మద్యం ప్రియులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో.. అంతకు రెట్టింపు వేగంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కాస్త ముందుగానే ఇవాళ (డిసెంబర్ 31) తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని ఏరియాల్లో ఏడున్నరకే తనిఖీలు మొదలుపెట్టిన పోలీసులు.. మొత్తంగా సిటీ వ్యాప్తంగా 8 గంటల లోపు ఎక్కడిక్కడ బ్యారికేడ్లతో తనిఖీలు స్టార్ట్ చేశారు.

మలక్ పేట, దిల్ సుఖ్  నగర్, చంపాపేట , నల్గొండ క్రాస్ రోడ్స్ లో డ్రంకన్ డ్రైవ్ చెకింగ్ ప్రారంభించారు పోలీసులు. 8 గంటల నుంచి  మొదలైన డ్రంకన్ డ్రైవ్ టెస్టులలో మద్యం ప్రియులు పట్టుబడుతున్నారు. నల్గొండ క్రాస్ రోడ్స్ మలక్ పేట లో దొరికిన మందు బాబుల వాహనాలు సీజ్ చేశారు.  రేపు (జనవరి 01) పోలీస్ స్టేషన్ కి వచ్చి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలని సూచించారు.

అబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ, బషీర్‌బాగ్‌, ఐమాక్స్‌, దోమలగూడ ప్రాంతాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిపి డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు ట్రాఫిక్‌ పోలీసులు. నాంపల్లి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూన్నారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో ఆ ఏరియాలో  ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇటు సికింద్రాబాద్ లో కూడా డ్రంకెన్ డ్రైవ్ కొనసాగుతోంది.

ఫలక్ నుమా దగ్గర బైక్ డ్రైవర్ కు 399 పాయింట్ల రీడింగ్:

ఫలక్ నుమా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో బైక్ డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి పట్టుబడ్డాడు.  టెస్టులో399 పాయింట్ల రీడిండ్ రావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. 

అటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర బాగా మద్యం సేవించి ఓ ఆటో డ్రైవర్ పట్టుబడ్డాడు. టెస్టులో 242 పాయింట్లు వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నరు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. 31 నైట్ ను పురస్కరంచుకొని రాత్రి రెండు గంటల వరకు చెకింగ్స్ ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.