నూతన సంవత్సర వేడుకలు శాపంగా మారకుండా అందరూ జాగ్రత్త పడాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. న్యూ ఇయర్ 2026 వేడుకల సందర్భంగా హైదరాబాద్ సిటీ ప్రజలకు సందేశం పంపిన ఆయన.. డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్లపై అల్లరి చిల్లరగా ప్రవర్తించవద్దని సూచించారు. నూతన సంవ్సరం ప్రతి ఒక్కరి జీవితానికి ఒక మలుపు కావాలని ఆశించారు. అంతేకాని నలుగురిలో నవ్వుల పాలు కాకూడదని ఆశించారు. జైళ్లలో ఉండాలో, సమాజంలో గౌరవంగా బతకాలో యువత ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
డీజీపీ పూర్తి సందేశం:
ఓ బాధ్యత గల పౌరుడా…!! డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకలు మీ పాలిట శాపంగా మారకూడదు. తెల్లారి లేవగానే జైలు గోడల మధ్య చీకట్లో ఉండాలో, సమాజంలో సగౌరవంగా ఉండాలో నీకు నువ్వు విచక్షణతో తెలుసుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్లపై అల్లరి చిల్లరగా ప్రవర్తించవద్దు. నూతన సంవత్సరం నీ జీవితానికి ఒక మలుపు కావాలి. నలుగురిలో నవ్వులపాలు కాకూడదు.
-DGP శివధర్ రెడ్డి
