హైటెక్స్లో సన్నీలియోన్.. ఎల్బీ నగర్లో సింగర్ సునీత.. హైదరాబాద్లో సెలబ్రిటీల లైవ్ పర్ఫామెన్స్

హైటెక్స్లో సన్నీలియోన్.. ఎల్బీ నగర్లో సింగర్ సునీత.. హైదరాబాద్లో సెలబ్రిటీల లైవ్ పర్ఫామెన్స్

హైదరాబాద్లో న్యూ ఇయర్ జ్యోష్ మామూలుగా లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు.. లైవ్ పర్ఫామెన్స్, మ్యూజికల్ నైట్స్ తో సిటీ అంతా సెలబ్రేషన్స్ తో దద్ధరిల్లుతోంది. స్టార్ హోటల్స్, క్లబ్స్, పబ్స్లో సెలబ్రేషన్స్ జోరుగా సాగుతున్నాయి. న్యూఇయర్ సందర్భంగా నగర వాసులకు ఏడాదంతా గుర్తుండిపోయేలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు కొందరు నిర్వాహకులు

న్యూఇయర్ 2026 వేడుకల్లో పాల్గొనేందుకు బాలీవుడ్ స్టార్స్ దిగివచ్చారు. హైటెక్స్లో హీరోయిన్ సన్నీ లియోన్ సందడి చేస్తున్నారు. మ్యూజికల్ నైట్ లో భాగంగా డ్యాన్స్ తో మంచి ట్రీట్ ఇస్తున్నారు. అదే విధంగా తెలుగు సింగర్ రామ్ మిర్యాల ప్రత్యేక మ్యూజికల్ షో ఏర్పాటు చేశారు.

ఇక కొండాపూర్ లోని క్వేక్ ఎరీనా పబ్ లో న్యూ ఇయర్ వేడుకలు కల్లు మిరుమిట్లు కొలిపేలా ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ సందడి చేస్తున్నారు. వందలాదిగా సిటీ వాసులు సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. 

హాయ్ ల్యాండ్లో మ్యూజికల్ కన్సర్ట్ ఏర్పాటు చేశారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ షోతో అదరగొడుతున్నాడు. మరోవైపు ఎల్బీ నగర్ GSR కన్వెన్షన్ లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా ప్లాన్ చేశారు. సింగర్ సునీత, ఆర్పీ పట్నాయక్ లైవ్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. దీంతో కన్వెన్షన్ అంతా కోలాహలంగా మారిపోయింది.