బడ్జెట్ తక్కువ.. కలెక్షన్స్ ఫుల్.. 2025లో టాలీవుడ్‌ను షేక్ చేసిన చిన్న హీరోలు!

బడ్జెట్ తక్కువ.. కలెక్షన్స్ ఫుల్.. 2025లో టాలీవుడ్‌ను షేక్ చేసిన చిన్న హీరోలు!

2025 టాలీవుడ్‌లో సరికొత్త మార్పుకు నాంది పలికింది. భారీ బడ్జెట్, అగ్ర తారలు ఉంటేనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుందనే పాత ఫార్ములాను తిరగరాశాయి. కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాలైనా సింహంలా గర్జిస్తాయని 2025 ఏడాదిలో నిరూపించాయి.. పెద్ద హీరోల సినిమాలు కొన్ని రికార్డులు సృష్టించినా.. మరికొన్ని బాక్సాఫీస్ వద్ద చతికలపడ్డాయి. . కానీ చిన్న చిత్రాలు ప్రేక్షలను థియేటర్ల వైపు రప్పించాయి.  మౌత్ టాక్‌తోనే పెద్ద చిత్రాలను సైతం బాక్సాఫీస్ వద్ద మట్టికరిపించాయి.  మేకర్స్ కాసుల వర్షం కురిపించాయి.

 కోర్ట్ (Court) - క్లాసిక్ బ్లాక్‌బస్టర్

 మార్చి 14, 2025న విడుదలైన 'కోర్ట్' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో, రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సామాజిక ఇతివృత్తంతో రూపొందింది. పోక్సో చట్టం చుట్టూ తిరిగే కథను చాలా హృద్యంగా చూపించారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా, కొత్త నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ఏకంగా రూ. 55 కోట్లు వసూలు చేసి 2025లో అతిపెద్ద ప్రాఫిట్ మేకర్‌గా నిలిచింది.

 

 మ్యాడ్ స్క్వేర్ (MAD Square) - కామెడీ జాతర


గతేడాది 'మ్యాడ్' సృష్టించిన నవ్వుల హంగామాను 'మ్యాడ్ స్క్వేర్' కొనసాగించింది. ఉగాది ( 2025 )కానుకగా విడుదలైన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లతో కలిసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. పెద్ద స్టార్ కాస్టింగ్ లేకపోయినా, ఈ చిత్రం దాదాపు రూ. 65 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.

 

 లిటిల్ హార్ట్స్ (Little Hearts) - యూత్ సెన్సేషన్

యూట్యూబర్ మౌళి, శివాని నాగారం జంటగా నటించిన 'లిటిల్ హార్ట్స్' ఈ ఏడాది సర్ ప్రైజ్ హిట్ ఇచ్చింది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, యువత మనసు గెలుచుకుంది. మౌళి కామెడీ టైమింగ్, శివాని నటన ఈ చిత్రానికి బలాన్ని ఇచ్చాయి. చిన్న చిత్రమైనా .. మౌత్ టాక్ తో పుంజుకున్న ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.

రాజు వెడ్స్ రాంబాయి - స్వచ్ఛమైన విలేజ్ లవ్ స్టోరీ

యదార్థ సంఘటనల ఆధారంగా, తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన 'రాజు వెడ్స్ రాంబాయి' ఒక అందమైన ప్రేమ కావ్యం. సాయిలు కంపటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సహజత్వానికి అద్దం పట్టింది.   ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. కేవలం రూ. 3 కోట్ల అత్యల్ప బడ్జెట్తో తీసిన ఈ సినిమా, రూ. 15 కోట్ల వసూళ్లు సాధించి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

 అరి (Ari) - విలక్షణమైన కథాంశం

మనిషిలోని అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) నేపథ్యంలో దర్శకుడు జయశంకర్ తీసిన సినిమా 'అరి'. అనసూయ, సాయి కుమార్ వంటి కీలక నటీనటులు ఉన్నప్పటికీ ఇది కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాగా గుర్తింపు పొందింది. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, కమర్షియల్‌గానూ మంచి లాభాలను ఆర్జించింది.

►ALSO READ | Vijay-Rashmika: రోమ్ వీధుల్లో విజయ్ -రష్మిక న్యూ ఇయర్ వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో!

ప్రేమ కథా చిత్రంగా వచ్చిన '8 వసంతాలు' థియేటర్లలో కంటే ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌లో భారీ రెస్పాన్స్ సంపాదించి ఈ ఏడాదిని గుర్తుండిపోయేలా చేసింది. మొత్తానికి 2025 టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక విషయాన్ని స్పష్టం చేసింది: "హీరో కంటే కథే గొప్పది." కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ విజయాలు నిరూపించాయి.