కొత్త ఏడాది స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాదైనా బంగారం, వెండి ధరలు దిగిరావాలని, తమకూ కొనుక్కునే అవకాశం వస్తే బాగుంటుందని భారతీయ మధ్యతరగతి ఆశిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా కొనసాగుతున్న సానుకూల పరిస్థితులు కూడా దీనికి సహకరిస్తున్నాయి. న్యూఇయర్ రోజున షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు ప్రజలు ముందుగా రెండు రాష్ట్రాల్లోని తాజారేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం.
తెలుగు రాష్ట్రాల్లో జనవరి 1, 2026న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో డిసెంబర్ 31 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.17 పెరిగింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 506గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ గ్రాముకు రూ.12వేల 380గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో అమ్మకాలు జగురుతున్నాయి.
ఇక వెండి తన మెగా ర్యాలీ నుంచి పక్కకు తప్పుకోవటంతో కొత్త ఏడాది మెుదటి రోజున స్వల్ప ఊరట లభించింది షాపర్లకు. దీంతో గురువారం జనవరి 1, 2026న వెండి రేటు వెయ్యి రూపాయలు తగ్గుదలను నమోదు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 56వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.256 వద్ద నేడు కొనసాగుతోంది.
