Shahid Afridi: ఐసీసీ టోర్నీలో పాకిస్థాన్‌పై భారత జట్టు పూర్తిస్థాయి ఆధిపత్యం చేలాయిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో కూడా గ్రూప్ దశలో పాక్‌పై ఇండియన్ టీమ్ విజయం సాధించింది. అనంతరం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలిచి.. టైటిల్ ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ను అప్పటి పాక్ సారథి షాహిద్ అఫ్రిది గుర్తు చేసుకున్నాడు. ఆ టోర్నమెంట్ ఫైనల్‌లో శ్రీలంకపై గెలిచి భారత్ విశ్వ విజేతగా నిలిచింది.
షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్2011లో మొహాలీలో భారత్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. ఆ మ్యాచ్‌లో మేము చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాం.. మా ఓపెనర్లు మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ ఫస్ట్ వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని అందించగా.. దీంతో భారత్‌ను ఓడించడం ఖాయమని చాలా ప్రశాంతంగా నేను కూర్చున్నాను.. కానీ తొలి వికెట్ పడగానే సీన్ రివర్స్ అయిపోయింది.. మా ఓపెనర్ ఔట్ కాగానే స్టేడియంలోని ఫ్యాన్స్ భారత జట్టుని ఉత్సాహపరిచిన తీరు అమోఘం అని అఫ్రిది కొనియాడారు.
►ALSO READ | Hardik Pandya: స్టేడియంలో హార్దిక్ పాండ్యా రొమాన్స్.. కేసు నమోదుతో జైలు శిక్ష?
స్టేడియంలోని అభిమానుల కేరింతలు, అరుపుల దెబ్బకు మైదానంలోని మా బ్యాటర్లు గజగజ వణికిపోవడం నేను చూశాను అని షాహిద్ అఫ్రిది వెల్లడించారు. ఆ సమయంలో భారత జట్టు తిరిగి అద్భుతంగా పుంజుకోవడంతో.. మా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ప్రతి బంతికి బాగా ఇబ్బంది పడ్డారు. మైదానంలో విపరీతమైన గోల మధ్య పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయారు.. కనీసం క్రీజులో నిలదొక్కునే ప్రయత్నం కూడా చేయలేకపోయారని షాహిద్ చెప్పుకొచ్చారు.
కాగా 2011 వరల్డ్ కప్‌లో మొహాలి వేదికగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేయగా.. అనంతరం 261 పరుగుల లక్ష్య చేధనలో దాయాది జట్టు పాక్ 231 రన్స్ కే చాప చుట్టేసింది. దీంతో29 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై ఇండియన్ టీమ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 85 రన్స్ చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
