Border 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ ‘బోర్డర్ 2’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Border 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ ‘బోర్డర్ 2’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

బాలీవుడ్ స్టార్ హీరోలు  సన్నీ దీియోల్, వరుణ్ ధావన్ నటించిన రీసెంట్ మూవీ బోర్డర్ 2. భారీ అంచనాల మధ్య జనవరి 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అంతేకాకుండా 2026 సంవత్సరంలో హిందీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి పెద్ద హిట్‌గా నిలిచింది.

ఈ చిత్రం 1997లో వచ్చిన బోర్డర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. దీనికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించగా, భూషణ్ కుమార్ నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.485 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించగా, ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.362.25 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.

ఈ భారీ బ్లాక్‌బస్టర్ వార్ యాక్షన్ డ్రామా త్వరలో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflixలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మార్చి 20 నుంచి ఓటీటీ ప్రేక్షకులకు ఈ మూవీ అందుబాటులోకి రానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. 

కథ:

ఫస్ట్ పార్ట్ మాదిరిగా 1971లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలోనే కథ సాగుతుంది. నిర్మల్ జిత్ సింగ్ సెఖాన్ ((దిల్జిత్ దొసాంజ్), మేజర్ హోషియార్ సింగ్ దహియా (వరుణ్ ధావన్), లెఫ్టినెంట్ మహేంద్ర ఎస్ రావత్ (అహాన్ శెట్టి) ముగ్గురు స్నేహితులు. సెఖాన్ పెళ్లి కోసం వీరందరు ఒకచోట కలిసిన సమయంలోనే పాకిస్థాన్ ఇండియాపై భారీ దాడికి సిద్ధమవుతుంది. అదే సమయంలో ఇండియాపై దాడి చేయడానికి పాకిస్థాన్ భూ, జల, వాయు మార్గాల ద్వారా కశ్మీర్, పంజాబ్, గుజరాత్ సరిహద్దుల వెంట భారీ దాడులకు సిద్ధమవుతుంది.

ఈ సమయంలో భారత సైన్యం నుంచి ఈ ముగ్గురు సైనికులకు అర్జెంట్ కాల్ రావడంతో వీరు యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే లెఫ్టినెంట్ కల్నల్ ఫతేహ్ సింగ్ కాలెర్ (సన్నీ డియోల్)తో కలిసి ఈ ముగ్గురు సైనికులు రాజస్థాన్, పంజాబ్, జమ్మూ-కాశ్మీర్ ప్రాంతాల్లో జరుగుతున్న పాక్ దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారు. ఈ క్రమంలో వారికి యుద్ధంలో ఎదురైన సవాళ్లు, త్యాగాలు  ఏమిటి? పాక్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అనేది మిగతా కథ.