న్యూఢిల్లీ: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 13 ఏళ్లలోపు పిల్లల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. “పేరెంట్ మేనేజ్డ్” అకౌంట్ మోడల్‌తో తల్లిదండ్రుల పర్యవేక్షణలో వీరు వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇప్పటివరకు కనీస వయసు పరిమితి 13 ఏళ్లుగా ఉంది. తల్లిదండ్రులు లేదా గార్డియన్లు పిల్లల కోసం అకౌంట్ సెట్ అప్ చేస్తారు. వారి కాంటాక్ట్ లిస్ట్‌ను నియంత్రించగలుగుతారు. మెసేజ్స్‌కు మాత్రం ఎండ్- టు- ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ప్రొటెక్షన్ ఉంటుంది. సెట్టింగ్స్‌ను మార్చాలంటే పేరెంట్ పిన్ ఇవ్వడం తప్పనిసరని వాట్సాప్ తెలిపింది.
