5 వేల మందితో SAP కోడ్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్.. ప్రారంభించిన మంత్రి వివేక్

 5 వేల మందితో  SAP  కోడ్  ఇన్నోవేషన్  ప్రోగ్రామ్.. ప్రారంభించిన మంత్రి వివేక్

 ఎప్పటికపుడు కొత్త స్కిల్స్ తో  కొత్త ఆలోచనలతో విద్యార్థులు ముందుకెళ్లాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో  కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో  సాప్ కోడ్ ఇన్నో వేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.  పలు కాలేజీల నుంచి వచ్చి  SAP కోడ్ ఇనో వేషన్ కార్యక్రమంలో పాల్గొన్న  విద్యార్థులకు  ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం  మాట్లాడిన మంత్రి వివేక్.. ఇక్కడ 5 వేల మంది విద్యార్థులతో SAP  కోడ్ ఇనో వేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారని.. .ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులను  చైతన్య పరచాలన్నారు .  విద్యార్థులు స్కిల్స్ తో రాణించాలనే మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు వివేక్.

 కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు..విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా ఎదగాలి అంటే సైలెంట్ గా వినాలి.  నేను డాక్టర్ చదువు కుంటున్న సమయంలో మా నాన్న నన్ను ఒక్క ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగంలో పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత  ఆ కంపెనీ యజమానితో అడిగాడు మా పిల్లోడు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అని అడిగారు.అప్పుడు ఆ యజమాని ..  గుర్రాన్ని చెరువు వద్దకు తీసుకెళ్తాం కానీ నీళ్ళు తాగించలేం   అని మా నాన్నతో  అన్నారంట. అప్పుడు మామ నాన్న పనిపై శ్రద్ధ పెట్టు లేకపోతే వెళ్లకు అన్నాడు. అప్పుడు అర్ధం అయింది.  ఏ పని చేసిన శ్రద్ధతో నేర్చుకోవాలి.కొత్త కొత్త టెక్నాలజీని  చూసి భయపడకుండా  నేర్చుకోవాలి.. అపుడు  భయపడాల్సిన అవసరం లేదు  అని మంత్రి వివేక్ అన్నారు. 

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు కోసం సాప్ కోడ్ ఇనో వేషన్ కార్యక్రమం ఉందనగానే వచ్చిన మంత్రి వివేక్ కి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వెంకట స్వామి సేవలను గుర్తు చేశారు కొమ్మూరి. తాను గతంలో ప్రభుత్వ ఉద్యోగిని ..అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా వెంకట స్వామి ఉన్నారని గుర్తు చేశారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.