వన్యప్రాణుల కోసం ఎనిమల్ రెస్టారెంట్స్.. డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ 

వన్యప్రాణుల కోసం ఎనిమల్ రెస్టారెంట్స్.. డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ 

కాగజ్ నగర్, వెలుగు: అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, అడవుల్లో వన్యప్రాణుల రక్షణ కోసం ఎనిమల్ రెస్టారెంట్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా డీఎఫ్​వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్ అన్నారు. గురువారం సిర్పూర్ టీ రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ ప్లాంటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో  'వన్యప్రాణుల నిర్వహణలో అటవీ శాఖ చర్యలు మీడియా పాత్ర ' అంశంపై వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో, ట్రైనీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ భార్గవ్, ఎఫ్ డీఓ అప్పయ్యతో కలిసి మాట్లాడారు. వన్యప్రాణుల సంరక్షణపై మీడియా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

అటవీ శాఖ చేపడుతున్న సంరక్షణ చర్యలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా సహకారం అవసరమన్నారు. వెయ్యి ఎకరాలు పోడు భూముల ను తిరిగి ఫారెస్ట్ గా మార్చిన విషయం అటవీశాఖ చేపడుతున్న చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. మనుషుల రెస్టారెంట్ తరహాలో వన్యప్రాణులకు అడవిలో నీరు, ఆహారం, సేద తీరేందుకు ప్రత్యేకంగా పచ్చిక బయళ్లు, గ్రాస్ ల్యాండ్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఏవో వెంకట్, రేంజ్ ఆఫీసర్లు ప్రవీణ్ కుమార్, సుభాష్, అనిల్ కుమార్, యోగేశ్ కులకర్ణి, విద్యుత్, ఆర్ అండ్ బీ, అటవీ శాఖ అధికారులు, సిర్పూర్ రేంజ్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.