గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి మంచి అవకాశాలు లభించగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉంటాయని జ్యోతి ష్య పండితులు చెబుతున్నారు. మార్చి 11వ తేదీన గురువు మిధునరాశిలో వక్ర మార్గం నుంచి రుజుమార్గంలో సంచరించడం ప్రారంభించాడు. దీని ప్రభావం వలన కొన్ని రాశుల వారికి( సింహ, కన్య, తుల, కుంభ, మీన) అదృష్టంవరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు . ఈ రాశులతొ పాటు మిగతా రాశుల వారికి ఎలా ఉంటుంది. దీని వలన జరిగే ప్రధాన మార్పుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
గురుడు రుజు ( నేరుగా) మార్గంలో మిధున రాశిలో సంచరించండం... బుధుడు కుంభరాశిలో తన సంచారం ..శుక్రుడు మీన రాశి సంచారాన్ని సాగిస్తున్నాడు. దీనిఫలితంగా ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో గ్రహాల ప్రభావం కనిపిస్తుంది.
మేష రాశి : ఈ ష రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలుంటాయి. వ్యాపారస్థులు మంచి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులుగుడ్ న్యూస్ వినే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: గురుడు మిధున రాశిలో రజుమార్గంలో సంచరించడం వలన ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు వాహనాన్ని సొంతంగా డ్రైవ్ చేయకపోవడమే చాలా మంచిది. చేపట్టిన పనులు ఆలస్యం కావడం.. రావలసిన డబ్బులు చేతికి అందకపోవడం.. ఖర్చులు పెరగడం వలన ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. కావున ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మిధున రాశి : ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వచ్చే అవకాశంతో పాటు .. కొత్త పెట్టుబడులకు మంచి ఛాన్స్ ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. పెళ్లి సంబంధాలు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా పురోగతితో పాటు .. ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.
సింహ రాశి: గురుడు మిథున రాశిలో నేరుగాసంచరించడం వలన ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని... ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పండితులు సూచిస్తున్నారు. .
కన్య రాశి: ఈ రాశి వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా పుంజుకునే అవకాశాలున్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయని. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
తులా రాశి : ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. కొన్ని అనవసర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు కొత్త పనులు చేపట్టే అవకాశం ఉండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పూర్వీకుల ఆస్థికలసివస్తుంది. స్నేహితుల సహకారం ఉంటుంది. వ్యాపారస్తులకు సామాన్యలాభాలుంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడికి సంబంధించి ప్రతిఫలం అందకుంటారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ అన్న విధంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకర రాశి: ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వచ్చే అవకాశంఉంది. వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులు ఆఫర్ లెటర్ అందుకుంటారు.
కుంభ రాశి : ఈ రాశి వారు వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త ప్రణాళికలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. మాట పట్టింపునకు పోకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించండి అంతా మంచే జరుగుతుంది.
మీనరాశి : ఈ రాశి వారు కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు.. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
