Vijay-Rashmika: రోమ్ వీధుల్లో విజయ్ -రష్మిక న్యూ ఇయర్ వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో!

Vijay-Rashmika: రోమ్ వీధుల్లో విజయ్ -రష్మిక న్యూ ఇయర్ వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న .. ఈ ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఈ జంట గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది.  వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ జంట త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నారు. అయితే లేటెస్ట్ గా వీరిద్దరూ.. న్యూ ఇయర్ వేడుకల ( 2026 ) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

రోమ్ వీధుల్లో ప్రేమ జంట..!

విజయ్ దేవరకొండ తన కొత్త ఏడాది వేడుకలను ఇటలీలోని రోమ్ నగరంలో ఘనంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను జనవరి 1న ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. కొలోసియం సందర్శన, ట్రైన్ జర్నీ వంటి అద్భుతమైన క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. "హ్యాపీ న్యూ ఇయర్ మై డార్లింగ్ లవ్స్.. మనం కలిసి ఎదుగుదాం, గొప్ప జ్ఞాపకాలను సృష్టించుకుందాం" అంటూ ఎంతో ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు. 

 

అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. విజయ్ పోస్ట్ చేసిన ఫోటోలు, అంతకుముందు రష్మిక మందన్న పోస్ట్ చేసిన ఫోటోలు ఒకే లొకేషన్‌లో ఉండటం గమనార్హం.ముఖ్యంగా ఒక ఫోటోలో విజయ్ వెనుక నుండి ఎవరో కౌగిలించుకున్నట్టుగా ఉండటం, వారి స్నేహితుల ముఖాల్లోని నవ్వులు చూస్తుంటే అది రష్మికే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరికొందరు నెటిజన్లు విజయ్ కళ్ళద్దాల్లో రష్మిక ప్రతిబింబం కనిపిస్తోందంటూ 'డిటెక్టివ్' వర్క్ కూడా మొదలుపెట్టేశారు.

ఉదయ్‌పూర్‌లో పెళ్లి గంటలు?

ఈ ఫోటోల రచ్చ ఇలా ఉండగానే, వీరి పెళ్లికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం .. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒక పురాతన ప్యాలెస్‌లోవిజయ్, రష్మికల   వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.  ఫిబ్రవరి 26న ఈ వేడుక అత్యంత వైభవంగా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుందని సమాచారం. ఇది పూర్తిగా ప్రైవేట్ వేడుకగా ఉండబోతోందని, పరిశ్రమకు చెందిన స్నేహితుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. రష్మిక తన రోమ్ పర్యటన వీడియోకు టేలర్ స్విఫ్ట్ పాటను జోడించడమే కాకుండా, విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఫోటోలకు పోజులివ్వడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చింది.

 

కెరీర్ పరంగా బిజీ బిజీ

ఒకవైపు వ్యక్తిగత జీవితం గురించి ఇంత చర్చ జరుగుతున్నా, ఇద్దరూ తమ వృత్తిపరమైన బాధ్యతల్లో బిజీగా ఉన్నారు.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్థన్ మూవీలో నటిస్తున్నారు. మొత్తానికి, 'గీత గోవిందం' సినిమాతో మొదలైన వీరి కెమిస్ట్రీ, ఇప్పుడు నిజజీవితంలో 'ఏడడుగుల' బంధం వైపు అడుగులు వేస్తోందని అభిమానులు ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు వేచి చూడాలి, ఈ జంట అధికారికంగా ప్రకటిస్తుందో లేదో!