రాయల్ ఎంటమోలాజికల్ సొసైటీ వార్షిక ఫొటోగ్రఫీ పోటీ విజేతలను ప్రకటించింది. చిన్న చిన్న పురుగుపుట్రా చూసినప్పుడు చాలాసార్లు జుగుప్సగానే అనిపిస్తుంటుంది. కానీ. కాస్త జూమ్ చేసి చూడండి.. ఎంత అందంగా ఉంటాయో! కెమెరా లెన్స్ మారిస్తే వాటి సోయగం కళ్లను కట్టిపడేస్తుంది.
18 ఏండ్లు పైబడిన వారి విభాగంలో రఘురామ్ అన్నదాన తీసిన ఈ చిత్రం చూశారా.. అరిటాకుపై కందిరీగ నడుస్తున్నప్పుడు దానికి సీతాకోక చిలుక గుడ్లు కనిపించాయి.
ఒక్కో గుడ్డు 1.8 మి.మీ ఉంటుంది. 110కి పైగా దేశాల నుంచి మూడు వేలకు పైగా ఎంట్రీలు వచ్చిన ఈ పోటీలో ఈ చిత్రం విజేతగా నిలిచి రికార్డు బ్రేక్ చేసింది. అలాంటి అబ్బురపరిచే మరికొన్ని విజేతల ఫొటోలను చూసేయండి.
