టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నుంచి నమీబియా ఔట్‌‌‌‌

టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నుంచి నమీబియా ఔట్‌‌‌‌

చెన్నై: సూపర్‌‌‌‌–8 ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో అమెరికా జోరు చూపెట్టింది. బ్యాటింగ్‌‌‌‌లో సంజయ్‌‌‌‌ కృష్ణమూర్తి (33 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌లతో 68 నాటౌట్‌‌‌‌), మోనాంక్‌‌‌‌ పటేల్‌‌‌‌ (30 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 52) హాఫ్‌‌‌‌ సెంచరీలతో చెలరేగడంతో.. ఆదివారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో అమెరికా 31 రన్స్‌‌‌‌ తేడాతో నమీబియాపై గెలిచింది. టాస్‌‌‌‌ గెలిచిన అమెరికా 20 ఓవర్లలో 199/4 స్కోరు చేసింది.  శయన్‌‌‌‌ జహంగీర్‌‌‌‌ (22)మిలింద్‌‌‌‌ కుమార్‌‌‌‌ (28) కూడా రాణించడంతో  యూఎస్‌‌‌‌ఏ మంచి టార్గెట్‌‌‌‌ను నిర్దేశించింది. విలియమ్‌‌‌‌ మైబర్గ్‌‌‌‌, గెరార్డ్‌‌‌‌ ఎరాస్మస్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు.

 ఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 168/6 స్కోరుకే పరిమితమైంది. లారెన్‌‌‌‌ స్టీన్‌‌‌‌క్యాంప్‌‌‌‌ (58), జేజే స్మిత్‌‌‌‌ (31), ఈటన్‌‌‌‌ (28) పోరాడి విఫలమయ్యారు. జాన్‌‌‌‌ ఫ్రైలింక్‌‌‌‌ (19), జాన్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ (18) మోస్తరుగా ఆడాడు. షాడ్లీ వాన్‌‌‌‌ 2, అలీ ఖాన్‌‌‌‌, సౌరభ్‌‌‌‌ నేత్రావల్కర్‌‌‌‌, శుభమ్‌‌‌‌ రంజన్‌‌‌‌ తలా ఓ వికెట్‌‌‌‌ తీశారు. సంజయ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. వరుసగా మూడు మ్యాచ్‌‌‌‌లు ఓడిన నమీబియా మెగా టోర్నీ సూపర్‌‌‌‌–8 రౌండ్ రేసు నుంచి నిష్క్రమించింది.