ముంబై: ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన వెస్టిండీస్.. టీ20 వరల్డ్ కప్‌లో సూపర్–8 బెర్త్ సొంతం చేసుకుంది. ఛేజింగ్‌లో కెప్టెన్ షై హోప్ (44 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 నాటౌట్), షిమ్రన్ హెట్‌మయర్ (32 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన గ్రూప్–సి లీగ్ మ్యాచ్‌లో విండీస్ 9 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచింది. టాస్ ఓడిన నేపాల్ 20 ఓవర్లలో 133/8 స్కోరుకే పరిమితమైంది. దీపేంద్ర సింగ్ ఐరి (47 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తర్వాత విండీస్ 15.2 ఓవర్లలోనే 134/1 స్కోరు చేసి నెగ్గింది. 4 వికెట్లకు తీసిన హోల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన నేపాల్... మెగా టోర్నీ నుంచి ఔటైంది.
హోల్డర్ సూపర్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ను విండీస్ బౌలర్లు బాగా కట్టడి చేశారు. ఇన్నింగ్స్ ఐదో బాల్‌కే కుశాల్ (1)ను ఔట్ చేసి అకిల్ హుస్సేన్ (1/30) ఇచ్చిన ఆరంభాన్ని మిగతా బౌలర్లు చివరి వరకు కొనసాగించారు. ఆసిఫ్ షేక్ (11), రోహిత్ పౌడెల్ (5) ఇన్నింగ్స్‌ను బాగు చేసే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. నాలుగో ఓవర్‌లో మాథ్యూ ఫోర్డ్ (1/10) దెబ్బకు రోహిత్ వెనుదిరగగా, దీపేంద్ర బ్యాట్‌తో అడ్డుకున్నాడు.
కానీ రెండో ఎండ్‌లో హోల్డర్ బౌలింగ్ ముందు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు తేలిపోయారు. తన వరుస ఓవర్లలో ఆసిఫ్ షేక్, ఆరిఫ్ షేక్ (2)ను ఔట్ చేసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఈ దశలో వచ్చిన లోకేశ్ బామ్ (13)ను జోసెఫ్ (1/38) అడ్డుకున్నాడు. ఇక వేగం పెంచిన దీపేంద్ర.. గుల్షన్ ఝా (11)తో ఆరో వికెట్‌కు 27, సోంపాల్‌తో ఏడో వికెట్‌కు 54 రన్స్ జోడించడంతో నేపాల్ ఆ మాత్రం స్కోరైనా చేసింది.
టాప్ లేపారు..
చిన్న టార్గెట్ ఛేదనలో బ్రెండన్ కింగ్ (22) ఫోర్‌తో ఖాతా తెరిస్తే, హోప్ రెండు బౌండ్రీలతో టచ్‌లోకి వచ్చాడు. ఐదో ఓవర్‌లో హోప్ మూడు ఫోర్లతో జోరు పెంచాడు. కానీ ఆరో ఓవర్‌లో కింగ్‌ను ఔట్ చేసి నందన్ యాదవ్ షాకిచ్చాడు. దాంతో తొలి వికెట్‌కు 43 రన్స్ భాగస్వామ్యం ముగియడంతో పాటు పవర్‌ప్లేలో విండీస్ 44/1 స్కోరు చేసింది. హోప్‌తో జతకలిసిన హెట్‌మయర్ వచ్చి రావడంతోనే రెండు ఫోర్లు బాదాడు.
ఆ వెంటనే మరో ఫోర్, సిక్స్ దంచగా, హోప్ బౌండ్రీతో ఫస్ట్ టెన్‌లో కరీబియన్లు 79/1తో నిలిచారు. ఇక్కడి నుంచి స్ట్రయిక్ రొటేట్ చేసిన హెట్‌మయర్ 12వ ఓవర్‌లో 6, 4తో రెచ్చిపోయాడు. తర్వాతి ఓవర్‌లో హోప్ దాన్ని రిపీట్ చేశాడు. 15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో హోప్ 38 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో హెట్‌మయర్‌తో కలిసి 91 రన్స్ జత చేయడంతో మరో 28 బాల్స్ మిగిలి ఉండగానే విండీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.
సంక్షిప్త స్కోర్లు
నేపాల్: 20 ఓవర్లలో 133/8 (దీపేంద్ర సింగ్ 58, సోంపాల్ 26*, హోల్డర్ 4/27). వెస్టిండీస్: 15.2 ఓవర్లలో 134/1 (హోప్ 61*, హెట్‌మయర్ 46*, నందన్ 1/24).
