గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన మంత్రి వివేక్ వెంకటస్వామి

గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన మంత్రి వివేక్ వెంకటస్వామి

న్యూ ఇయర్ సందర్భంగా పలువురు మంత్రులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా  కలిసి విషెస్ చెప్పారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, సీతక్క, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ గవర్నర్ కు పుష్ప గుచ్చం ఇచ్చి నూతన సంవత్సర  శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు గవర్నర్ కు విషెస్ చెప్పారు.

అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు ,హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.  కొత్త ఏడాదిలో  రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని , ప్రజలకు న్యాయవ్యవస్థ, ప్రభుత్వ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరారు.