దేశ రాజధాని ఢిల్లీలో అర్థరాత్రి సమాజం తలదించుకునే ఘటన.. కదులుతున్న వ్యానులో మహిళపై అత్యాచారం..లిఫ్టు ఇస్తామని, ఇంటిదగ్గర దింపుతాయని చెప్పి వ్యాను ఎక్కించుకునే దారుణానికి వడిగట్టారు. కాళ్లు మొక్కినా విడిచిపెట్టలేదు.. రాత్రి మొత్తం నరకం.. తెల్లవారు జామున రోడ్డుపై విసిరి పారేశారు.. ఎప్పుడు జనసంద్రంలా ఉండే ఢిల్లీలో ఈ దారుణం ఎవరికీ కనిపించలేదా..? ఆమె కేకలు ఎందుకు ఎవరూ వినలేకపోయారు?..
సోమవారం(డిసెంబర్29) రాత్రి 23ఏళ్ల మహిళ ఇంటికి వెళ్లేందుకు వెహికల్ కోసం వేచి ఉండగా లిఫ్ట్ ఇస్తామని వ్యానులో ఎక్కించుకొని సామూహిక అత్యాచారం చేశారు నిందితులు. ఆమెకు లిఫ్ట్ ఇస్తామని, ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి ఇద్దరు యువకులు వ్యానులో ఎక్కించుకున్నారు. కానీ తరువాత ఆమెను ఇంటికి కాకుండా గురుగ్రామ్ రోడ్డు వైపు కారు పోనిచ్చి దాదాపు మూడు గంటలకు పైగా ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వదిలేయాలని కాళ్లు మొక్కినా కనికరించలేదు,బెదిరించారు.. తనను రక్షించాలని ఆమె కేకలు వేసినా రోడ్డుపై ఉన్నవారికి వినిపించలేదు. మూడు గంటల పాటూ నరకం చూపించి చివరకు తెల్లవారు ఝామున గంటల సమయంలో ఎస్టీమ్ నగర్ లోని రాజా చౌక్ దగ్గర కదులుతున్న వ్యాన్ నుంచి ఆమెను కిందకు తోసేశారు.
ఘటన జరిగిన ఒక రోజు తర్వాత ఈ కేసులో ఇద్దరు వ్యాన్ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో బాధితురాలు నిందితులను ఇంకా గుర్తించకపోవడంతో వారి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఫరీదాబాద్ పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ,మధురకు చెందిన డ్రైవర్లు అయిన నిందితులను సెక్టార్ 48 క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. నేరానికి ఉపయోగించిన మారుతి సుజుకి ఈకో వ్యాన్ ను కూడా స్వాధీనం చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదాబాద్‌లోని జనంలేని ప్రాంతాల్లో వ్యాన్ ను తిప్పుతూ యువతిపై దాదాపు మూడు గంటల పాటు వాహనంలోనే అత్యాచారం చేశారు. ఆమె సహాయం కోసం కేకలు వేసింది. కానీ పొగమంచు విపరీతంగా ఉండటం.. బయటి ప్రదేశాలు కనిపించకపోవడం, వణికిస్తున్న చలితో రోడ్డుపై ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో ఎవరూ ఆమె కేకలు వినలేకపోయారని తెలుస్తోంది.
అత్యాచారం చేసిన తర్వాత తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎస్‌జిఎం నగర్‌లోని రాజా చౌక్‌లోని ములా హోటల్ సమీపంలో వాహనం కదులుతుండగానే ఆమెను వ్యాన్ నుండి బయటకు విసిరేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కదులుతున్న వ్యాన్ లోంచి కిందకు తోసేయడంతో బాధితురాలికి ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం ఫరీదాబాద్ ఆస్పత్రికి తరలించారు. నిందితులపై గ్యాంగ్ రేప్, క్రిమినల్ బెదిరింపుల కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది.
