వికారాబాద్ ఏటీసీలో టెక్నీషియన్ కోర్సులు

వికారాబాద్ ఏటీసీలో టెక్నీషియన్ కోర్సులు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​లో కొత్తగా ఏర్పడిన అడ్వాన్స్​డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)లో పీఎంకేవీవై 4.0 కింద ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నరేంద్ర బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ మూడు నెలల స్వల్పకాలిక శిక్షణ ద్వారా అభ్యర్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులకు అర్హులని, ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం వికారాబాద్ ప్రభుత్వ ఏటీసీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.