హిందూ మహాసముద్ర జలాలలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా సబ్మెరైన్ పేల్చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇరాన్ కు చెందిన 87 మంది చనిపోయారు. ఈ ఘటన తర్వాత భారత నౌకాశ్రయాలను ఉపయోగించుకుని ఇరాన్ పై యుద్ధం చేస్తోందని వస్తున్న సంచలన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.
ఇవి నిరాధారమైన ఆరోపణలని ఇండియా కొట్టిపారేసింది. తప్పుడు సమాచారంతో బురదజల్లటమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిరాధార ఆరోపణలు మంచిదికాదని హెచ్చరిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది విదేశాంగ మంత్రిత్వ శాఖ.
అమెరికా ఆర్మీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రెగర్ వన్ అమెరికా న్యూస్ నెట్వర్క్ (OAN) అనే ఛానెల్ లో మాట్లాడుతూ చేసిన వ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. మా ఆర్మీ బేస్ లు అన్నీ దెబ్బతిన్నాయి. హార్బర్ లు అన్నీ నాశనమయ్యాయి. మేము భారత నౌకాశ్రయాలను వినియోగించాల్సి వస్తోంది. ఇక్కడి నుంచే ఇరాన్ పై దాడులు చేస్తున్నాం.. అంటూ కల్నల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా వివాదాస్పదంగా మారాయి.
ఇది పూర్తిగా నిరాధారమైన రిపోర్ట్ అని ఇండియా ఆగ్రహించింది. ఇది ఒక ఫేక్ న్యూస్ అని..ఇండియాపై బుదరజల్లుకోవడం మానుకోవాలని విదేశాంగ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ రిలీజ్ చేసింది ఎక్స్టర్నల్ మినిస్ట్రీ (MoEA). ఇండియా ప్రతిష్టను దిగజార్చే ఆరోపణలను మానుకోవాలని సూచించారు.
అదే విధంగా పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థులు, యుద్ధ వాతావరణంపై ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. గాజాలో సామాన్యుల మృతిని భారత్ ఖండించిందని గుర్తు చేశారు.
Fake News Alert!
— MEA FactCheck (@MEAFactCheck) March 4, 2026
Claims being made on OAN, a US based channel that Indian ports are being used by the US Navy are fake and false. We caution you against such baseless and fabricated comments. pic.twitter.com/xiFWnkoXBk
