ఇస్లాం మతం స్వీకరించకపోతే రేప్ కేసు పెడతా... భర్తకు భార్య బెదిరింపులు..

ఇస్లాం మతం స్వీకరించకపోతే రేప్ కేసు పెడతా... భర్తకు భార్య బెదిరింపులు..

ఇస్లాం మతం స్వీకరించకపోతే రేప్ కేసు పెడతానంటూ భర్తను భార్య బెదిరించిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.. కర్ణాటకలోని గడగ్ జిల్లాకు చెందిన విశాల్ గోకవి అనే యువకుడు ఇస్లాం మతం స్వీకరించకపోతే రేప్ కేసు పెడతానంటూ తన భార్య తెహసిన్, ఆమె బంధువులు బెదిరించారని ఆరోపించారు. తెహసిన్, తాను మూడేళ్ళుగా ప్రేమించుకున్నామని..2024 నవంబర్ 26న పెళ్లి చేసుకున్నామని తెలిపాడు విశాల్. ఆ తర్వాత 2025 ఏప్రిల్ 25న ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకున్నామని.. అప్పుడు తనకు తెలియకుండా బలవంతంగా మతం మార్చారని ఆరోపించారు విశాల్. 

మతం మారడానికి ఒప్పుకోకుంటే.. తనపై రేప్ కేసు పెడతామని బెదిరించారని వాపోయాడు బాధితుడు. తన భార్య తరపు బంధువులు తనను మతం మారమని వేధిస్తున్నారంటూ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు విశాల్. తనను మానసికంగా హింసిస్తున్నారని.. ఇస్లామిక్ ప్రార్థనలు చేయమని బలవంతం చేస్తున్నారని పేర్కొన్నాడు విశాల్. పెళ్ళికి ముందు కూడా తన భార్య బెదిరించేదని.. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసేదని అంటున్నాడు విశాల్.

ALSO READ: అవి పాములని చెప్పండయ్యా.. మరీ ఇలా ఉన్నారేంట్రా..? ఈ వైరల్ వీడియో వెనకున్న నిజం ఏంటంటే..

పెళ్లి తర్వాత ఆమె మామ ఇబ్రహీం సాబ్ దావల్ ఖాన్, తల్లి బేగం బాను నన్ను వారి మతంలోకి మారమని..  జమాత్ (ఇస్లామిక్ సమాజం) లో చేరమని బలవంతం చేశారని తెలిపాడు బాధితుడు. తాను రోజూ నమాజ్ చేస్తున్నానా లేదా తెహసిన్ తన మామ ద్వారా నిఘా పెట్టేదని అన్నారు  బాధితుడు. ఇందుకు సంబంధించి ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో ఘటనపై స్పందించారు స్థానిక పోలీసులు. తమకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. బాధితుడి నుండి ఫిర్యాదు అందితే ఈ ఘటనను లవ్ జిహాద్ గా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.