Karnataka election 2023: 189 మందితో బీజేపీ తొలి జాబితా

Karnataka election 2023: 189 మందితో బీజేపీ తొలి జాబితా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ స్పీడ్ పెంచింది. 189 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించింది. ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ లిస్ట్ లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు.  సీఎం బసవరాజు బొమ్మై ఇపుడున్న షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప కుమారుడు బీవై విజయేంద్ర  శికారిపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఆ రాష్ట్ర మంత్రి బీ శ్రీరాములు బళ్లారి రూరల్ నుంచి పోటీ చేయనున్నారు.   మంత్రి ఆర్.అశోక పద్మనాభనగర్, కనకపుర స్థానాల్లో   రాష్ట్ర కాంగ్రెస్ చీప్ డీకే శివకుమార్ తో తలపడనున్నారు. 

ఫస్ట్ లిస్టులో 52 మంది కొత్త అభ్యర్థులు,  32 మంది వెనుబడిన వర్గాల  అభ్యర్థులు, 30 మంది షెడ్యుల్ కులాల అభ్యర్థులు ఉన్నారు. 9 మంది అభ్యర్థులు డాక్టర్లు, ఐదుగురు న్యాయవాదులు, ఇద్దరు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ,8 మంది మహిళలు ఉన్నారు. 

రెండో జాబితా త్వరలో రానుందని సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు.  కర్ణాటకలో మొత్తం  224 అసెంబ్లీ స్థానాలున్నాయి. మే 10న ఎన్నికలు జరగనుండగా.. మే 13న కౌంటింగ్ జరగనుంది.