సుమన్ నోరు అదుపులో పెట్టుకో

సుమన్ నోరు అదుపులో పెట్టుకో

పెద్దపల్లి, వెలుగు: ‘బాల్క సుమన్​ నోరు అదుపులో పెట్టుకో.. నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌‌, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని విమర్శించే స్థాయి నీది కాదు. మరోసారి ఆయనను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు.’ అని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాడె సూర్యనారాయణ ఎమ్మెల్యే సుమన్‌ను హెచ్చరించారు. ధర్మారంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వివేక్ వెంకటస్వామిని విమర్శించే స్థాయి, అర్హత బాల్క సుమన్‌కు లేదన్నారు. సుమన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి బీజేపీ లీడర్‌‌ అందుగుల శ్రీనివాస్‌పై గెలిచి చూపెట్టాలని సవాల్‌ చేశారు.  సుమన్​ రాజీనామా చేస్తే దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి అందడంతోపాటు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రెస్‌మీట్‌లో బీజేపీ ధర్మారం మండల అధ్యక్షుడు యాల్ల తిరుపతి రెడ్డి, దళిత మోర్చా అధ్యక్షుడు దేవి మల్లేశం, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు జంగిలి కిశోర్, గుమ్ముల తిరుపతి, దేవి రజినీకాంత్, పొలవేని స్వామి పాల్గొన్నారు.

అవివేకంతో మాట్లాడొద్దు..

కొత్తపల్లి, వెలుగు : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్​కుమార్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఇతర నాయకులు, కార్యకర్తలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న చెన్నూర్​ఎమ్మెల్యే బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాల్​రెడ్డి హెచ్చరించారు. రేకుర్తిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కమలాపూర్ మండలం ఉప్పల్ క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆటోడ్రైవర్ నాగేందర్ మృతిని బీజేపీపైకి నెట్టడం సుమన్‌ అవివేకానికి నిదర్శనమన్నారు. అవివేకంతో మాట్లాడవద్దని, ఆటోడ్రైవర్​ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్​ చేశారు. ప్రెస్‌మీట్‌లో దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లమల్ల ప్రసాద్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎలుక అభిలాష్, దళిత మోర్చా జిల్లా అధికార ప్రతినిధి ఎర్రోళ్ల ప్రశాంత్, నాయకులు గడ్డం రాజేశ్​, చంద్రగిరి వేణు, గుంటి రాజశేఖర్, గడ్డం రాజేశ్​, మాచర్ల రాజేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.