సీసీఐ..కేంద్ర నియమాలను పట్టించుకోవట్లే

సీసీఐ..కేంద్ర నియమాలను పట్టించుకోవట్లే

పత్తి కొనుగోలులో సీసీఐ కేంద్ర నియమాలను పాటించడం లేదన్నారు ఎంపీ సోయం బాపూరావు. కేంద్ర నిబంధనల  ప్రకారం ఐదు సార్లు తేమ శాతం లెక్కించాలి కానీ అలా ఎక్కడా జరగడం లేదన్నారు.పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రలను కలిసామన్నారు. రైతులు ప్రైవేటుకు కాకుండా సీసీఐకే పత్తి అమ్ముకోవాలని సూచించారు. 18 నుండి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో పత్తి రైతుల పక్షాన మాట్లాడుతానన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్, సిసిఐ, కొత్త రైల్వే లైన్లు కోసం పార్లమెంటులో లేవనెత్తుతానన్నారు. ఆసిఫాబాద్ లో మెడికల్ కాలేజ్, ట్రైబల్ యూనివర్సిటీ సాధించి తిరుతామన్నారు. రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు బీజేపీ  వల్లే సాధ్యమైందన్నారు ఎంపీ.