పాత్రలకు ప్రాణం పోసిన నసీరుద్దీన్ షా

పాత్రలకు ప్రాణం పోసిన నసీరుద్దీన్ షా

 విలక్షణ నటనతో ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. తన నటన ద్వారా ఎన్నో పాత్రలకు జీవం పోశారు. మూడు జాతీయ అవార్డులతోపాటు ఎన్నో అవార్డులు ఆయన సొంతం. 72వ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా నసీరుద్దీన్ షా నటనను ఆవిష్కరించిన కొన్ని సినిమాలు..

స్పర్శ్..

నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ స్పర్శ్ లో నసీరుద్దీన్ షా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ మూవీలో వితంతువుతో ప్రేమలో పడే అంధుడి పాత్రలో ఆయన నటించారు. అనిరుధ్ గా తన నటనతో మెస్మరైజ్ చేశారు షా. ఈ మూవీలో నటనకు గానూ ఆయన నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు. 

ఆక్రోష్

గోవింద్ నిహ్లానీ డైరెక్షన్ లో వచ్చిన అక్రోష్ లో లాయర్ గా అద్భుతంగా నటించారు నసీరుద్ధీన్ షా. కులవివక్ష, న్యావవ్యవస్థలో అవినీతిపై రూపొందిన ఈ మూవీలో భాస్కర్ కులకర్ణిగా షా సూపర్బ్ గా నటించారు. ఈ మూవీ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఓంపూరి, అమ్రీష్ పూరి లీడ్ రోల్స్ లో నటించారు.    

సర్ఫరోష్ 

జాన్ మ్యాథ్యూ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో నసీరుద్దీన్ షా సరికొత్తగా కన్పించారు. హీరో పాత్రలే కాదు అన్ని రకాల రోల్స్ షా పోషించగలడని ఈ మూవీతో రుజువైంది. గజల్ గాయకుడిగా ఆయన నటనకు అందరు చప్పట్లు కొట్టారు. 

త్రిదేవ్ 

రాజీవ్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన త్రిదేవ్ లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు నసీరుద్దీన్ షా. ఓయ్ ఓయ్, తిర్చి టోపీవాలే సాంగ్స్ ఈ మూవీలోనివే. జై సింగ్ పాత్రలో షా అందరినీ ఆకట్టుకున్నారు. 

ఇజాజత్

గుల్జార్ డైరెక్షన్ లో ఇజాజత్ మూవీలో ప్రేమికుడి పాత్రలో నసీరుద్దీన్ షా నటన అందరినీ అట్రాక్ట్ చేసింది. యాక్షన్ ప్యాక్డ్ సినిమాలే కాకుండా లవ్ మూవీస్ కూడా చేయగలడు అని నిరూపించాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆయిన ఈ మూవీలో ప్రేమికుడిగా షా చిరస్థాయిగా నిలిచిపోయారు. 

ఇక్బాల్ 

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీలో తాగుబోతు కోచ్ గా నటించి అందరితో సూపర్భ్ అనిపించుకున్నారు నసీరుద్దీన్ షా. భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న వికలాంగ బాలుడికి సాయం చేసే పాత్రలో ఆయన జీవించారు. నాగేష్ కుకునూర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ నేషనల్ అవార్డును గెలుచుకుంది. 

 

ఎ వెడ్నెస్  డే

అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా నటించిన మూవీ ఎ వెడ్నెస్  డే. సామాన్యుడి కష్టాలు, బాధల నేపథ్యంలో థ్రిల్లర్ డ్రామాగా రూపొందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హీరోయిజం, టెర్రరిజాన్ని ఈ మూవీ ప్రోజక్ట్ చేసింది.ఇందులో షా నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది. అభిమానులు స్క్రీన్లకు అతుక్కపోయేంతలా నటించాడు.