సమ్మర్ కానుకగా ఛత్రపతి

సమ్మర్ కానుకగా ఛత్రపతి

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘ఛత్రపతి’. అతను బాలీవుడ్‌‌‌‌ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్‌‌‌‌ను మాస్ హీరోగా నిలబెట్టిన రాజమౌళి సినిమా ‘ఛత్రపతి’కి ఇది రీమేక్. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

సోమవారం సినిమా రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. సమ్మర్ కానుకగా మే 12న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. ఒరిజినల్‌‌‌‌కి కథను అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌‌‌‌ రీమేక్ వెర్షన్‌‌‌‌కి కూడా రచయిత. తనిష్క్ బాగ్చి సంగీతం, అనల్ అరుసు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. సాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మహ్మద్ మోనాజీర్, ఔరోషికా డే, వేదిక, జాసన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.